కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సద్వినియోగం చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుందన్నారు జె.డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రేగుబిల్లిలో రైతు పూజోత్సవం కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. దేశాభివృద్ధి రైతులతోనే సాధ్యమని, కొవిడ్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వ్యవసాయ రంగం ఆదాయాన్ని సమకూర్చగలిగిందన్నారు. యువత వ్యవసాయరంగంలోకి రావాల్సిన అవసరం ఉందని, కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపయోగించుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుందని సూచించారు.
JD FOUNDATION: 'మూడు వ్యవసాయ చట్టాలను సద్వినియోగం చేసుకుంటే రైతుకు మేలు' - విజయనగరం తాజా వార్తలు
కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సద్వినియోగం చేసుకుంటే రైతులకు మేలు జరుగుతుందని జె.డి. ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడి ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతులు సంఘటితమై సొంతంగా సంస్థలు ఏర్పాటు చేసుకోగలిగితే వారి ఉత్పత్తులను.. ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడ విక్రయించుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడి ఇస్తే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్లో సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు ఆలోచన చేయాల్సి అవసరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేగుబిల్లిలో పొలం దున్ని రైతుల్లో ఉత్సాహం నింపారు. అదేవిధంగా పేదలకు నిత్యావసరాలు అందించారు. అనంతరం మండలం పరిధిలోని ఉత్తమ రైతులను సన్మానించారు.
ఇదీ చదవండి: