ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూకు గవర్నర్లు, కేంద్ర మంత్రులు - వైజాగ్ ప్రెసిడెంట్ ఫ్లీట్

ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రొటోకాల్ కమిటీ ఉంటుందని, పర్యటనలో ఎవరికి అప్పగించిన విధులు వారు నిబద్ధతతో నిర్వహించాలన్నారు. పలు రాష్ట్రాల గవర్నర్లతోపాటు, కేంద్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు.

jc review on president fleet
jc review on president fleet

By

Published : Feb 19, 2022, 7:31 PM IST

భారత రాష్ట్రపతి పర్యటన, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి, గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్​తోపాటు సీఎం జగన్, తమిళనాడు గవర్నర్, పలువురు కేంద్ర మంత్రులు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్ నెంట్ గవర్నర్ హాజరు కానున్నారన్నారు. రాష్ట్రపతితోపాటు, కేంద్ర మంత్రులు ఐఎన్ఎస్ డేగ విమానాశ్రయంలోనే దిగుతారన్నారు.

రాష్ట్రపతి లైజన్ అధికారులుగా ఉప కలెక్టర్ రంగయ్య, డీఈవో చంద్రకళ, గవర్నర్​కు ఆర్డీవో గోవిందరావు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్ నెంట్ గవర్నర్​కు సెట్విస్ సీఈవో వ్యవహారిస్తారన్నారు. ప్రోటోకాల్ కమిటీ ఉంటుందని, పర్యటనలో ఎవరికి అప్పగించిన విధులు వారు నిబద్ధతతో నిర్వహించాలన్నారు.

మరో జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ ఆంబులెన్స్ అవసరమైన మందులు, పరికరాలు, రక్తం మొదలైనవి సిద్ధం చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండి:విశాఖ సాగరతీరానికి నేవీ కళ.. ఆర్‌కే బీచ్‌కు రంగుల హంగులు

ABOUT THE AUTHOR

...view details