ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడు పనుల పురోగతి, స్థితిగతులపై జేసీ సమీక్ష - జాయింట్ కలెక్టర్ డా. మహేశ్ కుమార్ అభివృద్ధి పనులపై స‌మీక్ష

విజయనగరం జిల్లాలో నాడు-నేడు ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా.మ‌హేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులతో కలెక్టరేట్​లో సమావేశమయ్యారు. అన్ని శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని ఆయన సూచించారు.

నాడు నేడు పనుల పురోగతి, స్థితిగతులపై జేసీ సమీక్ష
నాడు నేడు పనుల పురోగతి, స్థితిగతులపై జేసీ సమీక్ష

By

Published : Sep 25, 2020, 5:12 PM IST

విజయనగరం జిల్లా క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో తహసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారుల‌తో జాయింట్ కలెక్టర్ డా.మహేశ్ కుమార్ అభివృద్ధి పనులపై స‌మీక్ష నిర్వ‌హించారు. నాడు-నేడు ప‌నుల స్థితిగ‌తుల‌ు, వాటి పురోగతిపై మండ‌లాల వారీగా వివ‌రాలు తెలుసుకున్నారు. క్షేత్ర‌స్థాయి అధికారులు నాడు-నేడు ప‌నుల‌ను త‌నిఖీ చేయాల‌ని జేసీ ఆదేశించారు.

ఖర్చు వివరాలు వెల్లడిస్తేనే బిల్లులు..

ఎం-బుక్ నిర్వ‌హ‌ణ‌లో ఇంజి‌నీరింగ్ అసిస్టెంట్ల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని ఆయన సూచించారు. పూర్తైన ప‌నుల‌ను ఫొటోల‌తో స‌హా అప్‌లోడ్ చేయాల‌ని సూచించారు. సిమెంట్ తీసుకున్న‌వారు, సంబంధించిన ఖర్చు వివరాలు అప్‌లోడ్ చేస్తేనే బిల్లులు చెల్లిస్తామని స్ప‌ష్టం చేశారు. పెండింగ్ ఉన్న‌వారంతా, వినియోగించిన సిమెంట్ వివ‌రాల‌ను వెంట‌నే అప్‌లోడ్ చేయాల‌ని కోరారు.

ఆ బాధ్యత మనదే..

సాంకేతికత స‌మ‌స్య‌ల‌తో ప‌నుల‌ను పెండింగ్‌లో ఉంచ‌డం స‌రికాద‌ని, వాటిని ప‌రిష్క‌రించాల‌ని స్పష్టం చేశారు. టెక్నాలజీ స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్య‌త్​లో ఇలాంటి పొరపాట్లు కొన‌సాగ‌కుండా చూడాల‌ని సూచించారు.

ఇవీ చూడండి : 'వ్యవసాయ బిల్లులతో బానిసలుగా రైతులు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details