కరోనా పరీక్షలతో సంబంధం లేకుండా... లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. ఆరోగ్యమిత్ర, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ మిత్రాలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు అందుతున్న వైద్యం, ఇతర సదుపాయాలు, మిత్రాల సమస్యలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న వివిధ సమస్యలను, మిత్రాల పనితీరును ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రియాంక వివరించారు. గ్రామాల్లో కోవిడ్ వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లయితే... వారిని ఆసుప్రతిలో చేర్పించాల్సిన బాధ్యత మిత్రాలదేనని స్పష్టం చేశారు. రోగులు ఆసుప్రతుల్లో చేరేవరకూ, వారికి అన్నిరకాల సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు.
'ప్రతి కేసును ఖచ్చితంగా నమోదు చేయాలి' - విజయనగరం జిల్లాలో కరోనా కేసులు వార్తలు
కరోనా పరీక్షలతో సంబంధం లేకుండా... లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. ఆరోగ్యమిత్ర, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ మిత్రాలతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు.
కొన్ని కోవిడ్ ఆసుపత్రుల యాజమాన్యాలు ..రోగులతో ఆర్థిక ఒప్పందాలను చేసుకుంటున్నట్లు, అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఇటువంటి వాటిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటివి ఏమైనా మిత్రాల దృష్టికి వచ్చినట్లయితే.. ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ప్రైవేటుగా వైద్యం చేయించుకొనే వ్యక్తులనుంచి .. ఆసుపత్రులు అంగీకార పత్రాన్ని తీసుకొనేలా చూడాలన్నారు. కేసుల నమోదు విషయంలో, ఆన్‌లైన్ జాబితాకు, ఆఫ్‌లైన్ జాబితాకు మధ్య తేడా ఉంటోందని, ప్రతి కేసును ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా రోగి ఆసుపత్రిలో చేరేటప్పుడు జాప్యం జరగకుండా చూడాలన్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లోని రోగులను వైద్యులు ప్రతిరోజూ తనిఖీలు చేస్తున్నదీ లేదని పరిశీలించాలని జేసీ సూచించారు.
ఇదీచూడండి.కరోనాతో మృతి చెంది గంటలు కావస్తున్నా.. పట్టించుకోవట్లేదు