ప్రధాని మోదీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా శృంగవరపుకోట వాసులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారు. ఉదయం నుంచే జనం రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. ఏడు గంటల సమయానికి రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. వ్యాపార దుకాణాలు, హోటల్స్, మాల్స్, లాడ్జీలు, సినిమా థియేటర్లు, రైతు బజారు అన్ని మూతబడ్డాయి. నిత్యం పట్టణంలో రద్దీగా ఉండే కూడలి జనం లేక బోసిపోయాయి. వైరస్‌పై పోరాటానికి జనం నుంచి అనూహ్య మద్దతు లభించినందున అధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఎస్.కోటలో ముగిసిన జనతా కర్ఫ్యూ - jantha curfew in s.kota latest updates
ప్రధాని పిలుపు మేరకు విజయనగరం జిల్లా ఎస్.కోటలో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆదివారం చేపలు, మాంసం దుకాణాలు మూతబడ్డాయి. జనం లేక వెలవెలబోయాయి. నిత్యం రద్దీగా ఉండే అరకు రోడ్డు ఖాళీగా ఉంది. పారిశుద్ధ్య సిబ్బంది యథావిధిగా పరిశుభ్రత కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
ప్రశాంతంగా ముగిసిన ఎస్.కోట జనతాకర్ఫ్యూ
TAGGED:
janata curfew in s.kota