ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూలో ప్రజలు భాగస్వాములయ్యారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఉదయం 7 గంటల తర్వాత ఎవ్వరూ ఇళ్లు విడిచి బయటకు రాలేదు. ప్రధాన రహదారులు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ మార్కెట్ తదితర ప్రాంతాలన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. ప్రజలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఇళ్లకు పరిమితం అయ్యారు. ఆసుపత్రి వద్ద సిబ్బంది అత్యవసర సేవలకు సిద్ధంగా ఉన్నారు.
జనతాకర్ఫ్యూకు పార్వతీపురం వాసుల మద్దతు - vijayanagaram district janata curfew latest news
జనతా కర్ఫ్యూకు పార్వతీపురం వాసులు పూర్తి స్థాయి మద్దతు పలికారు. రైళ్లు, బస్సులు, ఆటోలన్నీ నిలిచిపోయాయి. రద్దీ ప్రదేశాలు సైతం వెలవెలబోయాయి. ప్రధాన కూడలి వద్ద పోలీసులు పరిస్థితిని గమనించారు.
![జనతాకర్ఫ్యూకు పార్వతీపురం వాసుల మద్దతు janatha curfew in parvathipuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6504631-914-6504631-1584879423702.jpg)
పార్వతీపురంలో జనతాకర్ఫ్యూ