జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రైతులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట పార్టీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. నివర్ తుపానుతో పంటలు మునిగి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతకు ఇప్పటికీ పరిహారం ఇవ్వకపోడం బాధాకరమని విజయనగరం నియోజకవర్గం ఇంఛార్జి పాలవలస యశస్వి అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే రూ. 10వేలు అందజేసి కర్షకులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇంఛార్జిలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
'తక్షణమే రూ. 10వేలు అందజేసి కర్షకులను ఆదుకోవాలి' - janasena protest for supporting to crop damaged farmers
తుపాను కారణంగా నష్టపోయిన అన్నదాతలకు తక్షణమే రూ. 10వేలు అందజేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
!['తక్షణమే రూ. 10వేలు అందజేసి కర్షకులను ఆదుకోవాలి' janasena protest at Vizianagaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9794845-876-9794845-1607347295789.jpg)
తక్షణమే రూ. 10వేలు అందజేసి కర్షకులను ఆదుకోవాలి