విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యురాలు పాలవలస యశస్వి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జనసైనికులంతా కలిసికట్టుగా పట్టణ, గ్రామాల్లోకి పవన్ కల్యాణ్ భావజాలాన్ని తీసుకెళుతామన్నారు. రాబోయే రోజుల్లో విజయనగరంలో జనసేన పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు.
జిల్లాలో జనసేన జెండా ఎగురవేస్తాం: పాలవలస యశస్వి - vizainagaram latest news
విజయనగరం జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళ్లే దిశగా కృషి చేస్తున్నామని ఆ పార్టీ నాయకురాలు పాలవలస యశస్వి అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో జనసేన జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న జనసేన రాష్ట్రపోలిటికల్ ఆఫైర్స్ సభ్యురాలు యశస్వి