ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు - విజయనగరంలో సీఎం పుట్టిన రోజు వేడుకలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం పిలుపు మేరకు పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వందలాది మంది యువ కార్యకర్తలతో పాటు పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని రక్తదానం చేశారు.

Jagan's birthday celebrations
విజయనగరంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Dec 21, 2020, 3:43 PM IST

Updated : Dec 21, 2020, 3:56 PM IST

విజయనగరం జిల్లా వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు వేడుకను గిప్ట్ లతో కాకుండా రక్తదానం చేయాలన్న పిలుపు మేరకు పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

పార్వతీపురం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్వతిపురం లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన కనిపించింది . యువత పోటాపోటీగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావు ఆయన కుమార్తె శ్రేయ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతను ఎమ్మెల్యే అభినందించారు. ఈ ప్రాంత పరిధిలో 500 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు.

చీపురుపల్లి...

సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా... చీపురుపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తోపాటు విజనగరం జిల్లా నియోజకవర్గాల సమన్వయకర్తలు మజ్జి శ్రీనివాసరావు, స్థానిక మండల వైకాపా నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

సాలూరు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం సాలూరు పట్టణంలో నిర్వహించారు. స్థానికంగా వైకాపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువత ఎక్కువగా పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే ప్రశంసా పత్రంతో పాటు , పండ్లు అందించారు.

ఇదీ చదవండీ...సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి

Last Updated : Dec 21, 2020, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details