విజయనగరం జిల్లాలోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన పర్యటించారు. సాలూరు మండలం కొఠియా గ్రామాలైన నేరెళ్ళవలస, దులిభద్ర, డి.తాడివలస, పగులుచేన్నురు గ్రామాల్లో వీరు పర్యటించారు.
వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించిన.. ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్
వివాదాస్పద కొఠియా గ్రామాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. కూర్మనాథ్ , సబ్ కలెక్టర్ భావన పర్యటించారు. ఈ గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు.
వివాదస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించిన ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్
ఈ గ్రామాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పాగులుచెన్నూరు, నేరెళ్లవలస గ్రామాల్లో.. పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా.. అర్హులైన గిరిజనులను గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. వారి వెంట సాలూరు తహసీల్దార్, సీఎస్డీటీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదీ చదవండి: