ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురుపాం మండలంలో పర్యటించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి - nadu nedu news

ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ విజయనగరం జిల్లాలోని కురుపాం మండలంలో పర్యటించారు. టీకా పంపిణీ, ఉద్యాన పంటలపై గిరిజనులకు అవగాహన కల్పనతో పాటు, కురుపాంలోని గిరిజన పాఠశాలలో 'నాడు-నేడు' పనులను పరిశీలించారు.

itda project officer in vizianagaram district
కురుపాం మండలంలో పర్యటించిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి

By

Published : Jun 2, 2021, 8:44 PM IST


విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని మొండెంఖల్లు గ్రామం పీహెచ్​సీ చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఐటీడీఏ(ITDA) ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పరిశీలించారు. అర్హులందరూ తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డ్ చూపించి వాక్సినేషన్ తీసుకోవాలన్నారు. టీకా తీసుకున్న తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా మాస్కు, భౌతికదూరం పాటిస్తూ.. శానిటైజేషన్ కొనసాగించాలని సూచించారు. వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మండలంలోని గుమ్మలో ఆర్ఓఫ్ఆర్ కింద పట్టాలు పొందిన గిరిజనులకు ఉద్యాన పంటలపై కూర్మనాథ్ అవగాహన కల్పించారు. జీడి మామిడి, జామి మెుక్కలను అందజేశారు. అనంతరం కురుపాంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న 'నాడు-నేడు' (Nadu-Nedu) పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details