ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఐఏఎస్​ అధికారి

ఆయనో ఐఏఎస్​ అధికారి. తలుచుకుంటే... తన పిల్లలను మంచి కార్పొరేట్ పాఠశాలకు పంపేవారు. కానీ అలా చేయలేదు. అందరికీ ఆదర్శవంతమైన పని చేశారు. ప్రభుత్వ బడిలో తన కుమారుడిని చేర్పించారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఆయనే.. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్.

itda officer enrolled his son joined farm in a government school
కుమారుడుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఐఏఎస్​ అధికారి

By

Published : Nov 25, 2020, 1:48 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పథక సంచాలకులు ఆర్​. కూర్మనాథ్.. తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచారు. పదో తరగతి చదువుతున్న తన కుమారుడిని కొత్త పోలమ్మ పురపాలక పాఠశాలలో చేర్పించారు.

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన వల్ల..... ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థుల మనోవికాసానికి బీజం పడుతుందని కూర్మనాథ్ చెప్పారు. తను ఎక్కడ విధులు నిర్వహిస్తే.. అక్కడి ప్రభుత్వ బడిలోనే కుమారుడిని చేర్పిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థి మనోవికాసానికి ప్రభుత్వ బడిలోనే బాటలు పడతాయని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details