ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యమని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్. కూర్మనాథ్ చెప్పారు. విజయనగరం జిల్లా పాంచాలి గ్రామంలో జడ్పీ, జిఎన్ పేట గిరిజన పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధి హామీ నిధులతో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో ఎటువంటి లోపాలున్నా సహించేది లేదన్నారు. అనంతరం మక్కువ మండలం అనసభద్రలో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
పాఠశాలల్లో నిర్మాణ పనులను పరిశీలించిన ఐటీడీఏ డైరెక్టర్ - విజయనగరం ఐటీడీఏ తాజా వార్తలు
ఐటీడీఏ అధికారి ఆర్. కూర్మనాథ్ విజయనగరం జిల్లాలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని.. జాప్యాన్ని సహించేది లేదన్నారు.
పాఠశాలల్లో పలు నిర్మాణ పనులను పరిశీలించిన ఐటీడీఏ డైరెక్టర్