ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

13 మంది రైలులో.. మరో ఇద్దరు బస్సులో! - విజయనగరంలో లాక్​డౌన్

ఇటలీ నుంచి బయలుదేరి స్వదేశానికి వచ్చిన 33 మంది విద్యార్థులు లాక్‌డౌన్‌తో రాయపూర్‌, విశాఖపట్నంలో చిక్కుకుపోయారు. వీరికి అక్కడ 16 రోజులు క్వారంటైన్‌ పూర్తి కాగా.. విశాఖపట్నం నుంచి 13 మంది, రాయపూర్‌ నుంచి ఇద్దరు విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. మండల తహసీల్దార్ల సమక్షంలో కుటుంబ సభ్యులకు వారిని అప్పగించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రమణకుమారి తెలిపారు.

italy students came to thier homes  at vizianagaram
విజయనగరానికి చేరుకున్న ఇటలీ విద్యార్థులు

By

Published : Apr 14, 2020, 12:53 PM IST

లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఇటలీ నుంచి బయలుదేరి స్వదేశానికి వచ్చిన 33 మంది విద్యార్థులు లాక్‌డౌన్‌తో రాయపూర్‌లో చిక్కుకుపోయారు. వీరికి అక్కడ 16 రోజులు క్వారంటైన్‌ పూర్తైంది. ఒడిశా నుంచి జిల్లాలోకి వీరి బస్సు ప్రవేశించగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ రాజకుమారి వారికి కాన్వాయ్‌ ఏర్పాటు చేశారు. 33 మంది విద్యార్థుల్లో జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉండగా.. విజయనగరం చేరగానే వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో కేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు.

దిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బయలుదేరి విశాఖపట్నంలో చిక్కుకుపోయిన 13 మంది జిల్లా వాసులను గూడ్స్‌ రైలులో జిల్లాకు తరలించారు. వారిలో ఒకరు కొత్తవలసలో దిగిపోగా, మిగిలిన 12 మంది విజయనగరం చేరుకున్నారు. వీరిని అంబులెన్స్‌లలో కేంద్ర ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షల అనంతరం స్థానిక మండల తహసీల్దార్లకు అప్పగించారు. వీరందరూ ఇప్పటి వరకు విశాఖపట్నంలో క్వారంటైన్‌లో ఉన్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నాక అందరికీ కరోనా నెగిటివ్‌ అని తేలిన తర్వాతే స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించారు.

ABOUT THE AUTHOR

...view details