విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో ఉపాధి హామీ పథకం కూలీల నుంచి క్షేత్ర సహాయకులు, మేస్త్రీలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలగొడవ గ్రామానికి చెందిన కూలీలు ఎంపీడీవో కార్యాలయంలో వసూళ్లపై ఫిర్యాదు చేశారు. కూలీల నుంచి వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి మరి కొంతమంది తీసుకెళ్లారు.
ఉపాధి హామీ పథకంలో అక్రమ వసూళ్లు
ఉపాధి హామీ పథకం కూలీల నుంచి క్షేత్ర సహాయకులు, మేస్త్రీలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పార్వతీపురం మండలంలోని ఎంపీడీవో కార్యాలయానికి ఫిర్యాదులూ అందాయి. స్పందించిన అధికారులు విచారణ చేపడతామన్నారు.
Irregularities in employment guarantee scheme at Parvatipuram in Vizianagaram district
గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని ఎంపీడీవో కృష్ణారావు వద్ద ప్రస్తావించగా.. ఉపాధి పనులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై బహిరంగ విచారణ చేపడతామన్నారు. ఎవరూ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు.
ఇదీ చదవండి:ఏనుగే ఆ బాంబు ఉన్న పండును ఆరగించిందా?