ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Iron locker ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి బయటపడ్డ ఐరన్ లాకర్

Iron locker పురాతన ఇల్లు కూలుస్తుండగా గోడ నుంచి పెద్ద ఐరన్ లాకర్ బాక్స్ బయటపడింది. కూలీలు ఇంటి యజమానికి చెప్పకుండా గోప్యంగా ఉంచినా ఆనాటా ఈనోటా పాకి యజమానికి రామలింగానికి విషయం తెలిసింది. ఆ ఇనుప లాకర్లో గుప్తనిధి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. లాకర్‌ఇంకా తెరవలేదని యజమాని తెలిపారు.

Iron locker
ఐరన్ లాకర్

By

Published : Aug 13, 2022, 12:50 PM IST

Iron locker విజయనగరం జిల్లా రాజాంలోని కంచర వీధిలో ఒక పురాతన ఇల్లును కూల్చేటప్పుడు గోడ నుంచి పెద్ద ఐరన్ లాకర్ బాక్స్ బయటపడింది. తొలుత దీన్ని కూలీలు ఇంటి యజమానికి చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇంతలో ఇంటి యజమాని రామలింగంకు విషయం తెలియడంతో కూలీలకు యజమానికి మధ్య బాక్స్ మాది అంటే మాది అని వాగ్వాదం జరిగింది. ఆ ఇనుప లాకర్లో గుప్తనిధి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐరన్ లాకర్ బాక్స్ దొరకడం వాస్తవమే అని అది తాము ఇంతవరకు తెరవలేదని యజమాని రామలింగం చెబుతున్నారు. పోలీసులకు రెవిన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details