విజయనగరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్‌తో ఐఓసీ అధికారులు భేటీ అయ్యారు. జిల్లాలో పలు మండలాల మీదుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పైప్ లైన్ నిర్మాణానికి సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు గడవు నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తవటానికి జిల్లా అధికారుల సహకారం అందించాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో 96 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మించాల్సి వుండగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం సహకారంతో చీపురుపల్లి, గరివిడి, నెల్లిమర్ల, బొండపల్లి, జామి తదితర ఐదు మండలాల మీదుగా 53 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తిచేశామని, మరో 43 కిలోమీటర్లకు సంబంధించి గంట్యాడ, ఎల్.కోట, కొత్తవలస మండలాల్లో పనులు పూర్తికావలసి వుందన్నారు. ఇందులో కొత్తవలసలో 15 కి.మీ, ఎస్.కోటలో 15, గంట్యాడలో 13 కి.మీ. మేర పైప్ లైన్ నిర్మాణం చేయాల్సి వుందని ఆయా మండలాల్లో పనులకు త్వరగా అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జేసీ... జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని అధికారులకు వివరించారు.. సెప్టెంబరులోగా పనులు పూర్తిచేసేందుకు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ హామీ ఇచ్చారు.
విజయనగరం జేసీతో ఐఓసీ అధికారుల భేటీ - ioc news in vijayanagaram
సెప్టెంబర్ నెలాఖరులోగా విజయనగరం జిల్లా మండలాల్లో పైప్ లైన్ పనులు పూర్తయ్యే విధంగా జిల్లా అధికారులు సాయం చేయాలని... ఐఓసీ అధికారుల విజయనగరం జాయింట్ కలెక్టర్‌ను కోరారు. 96 కిలోమీటర్ల పనుల్లో... 53 కి.మీ మేర పనులు ఇప్పటికే పూర్తైనట్లు వివరించారు.
విజయనగరం జేసీతో ఐఓసీ అధికారుల భేటీ