విజయనగరం జిల్లా మొత్తంగా ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరైన 24,429 మందికి 13,266 ఉత్తీర్ణత సాధించారు. 49 శాతం బాలురు, 59 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయంలో 20,985 మందికి 12,257మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో 56శాతం బాలురు 62 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్లో మరోసారి సత్తా చాటిన జిల్లా విద్యార్థులు ! - ఇంటర్లో మరోసారి సత్తా చాటిన జిల్లా విద్యార్థులు !
ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయనగరం జిల్లా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు వరుసగా ఆరోసారి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచారు. ప్రధమ, ద్వితీయ రెండింటిలోనూ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సత్తాచాటారు. గతేడాదితో పోలిస్తే...ఉత్తీర్ణత శాతం తగ్గినప్పటికీ ప్రథమ స్థానాన్ని పదిలం చేసుకుంది. ఎప్పటిలాగే ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. గురుకుల విద్యాలయాలు కూడా వరుసగా మూడోసారి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి.
![ఇంటర్లో మరోసారి సత్తా చాటిన జిల్లా విద్యార్థులు ! ఇంటర్లో మరోసారి సత్తా చాటిన జిల్లా విద్యార్థులు !](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7710820-869-7710820-1592745061842.jpg)
జిల్లాలోని పది గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది సీనియర్ ఇంటర్లో 627మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా..,534మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు 85.83శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సంలో 617మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కాగా., 71.28శాతంతో 443మంది ఉత్తీర్ణత సాధించారు.
ప్రత్యేక కార్యచరణ, పాఠ్య ప్రణాళిక అమలు చేయటంతోనే ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, గురుకులాలు రాష్ట్రంలోనే మేటిగా నిలిచాయని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇదే ఒరవడిని కొనసాగిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఇంటర్లో కొమరాడ బాలయోగి గురుకుల,గుమ్మలక్ష్మీపురం గిరిజన, జోగింపేట ప్రతిభా కళాశాల్లో వందకు వందశాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు.