విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సోమవారం ఉదయం విజయనగరం - పాలకొండ రహదారి గాంధీ బొమ్మ సెంటర్లో కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పాలకొండ వెళ్తున్న ఇన్నోవా కారు కుక్కను తప్పించ బోయి పక్కనే ఉన్న స్కూటీనీ, విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికి ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసినట్లు చీపురుపల్లి ఎస్ఐ దుర్గ ప్రసాద్ తెలిపారు.
కుక్కను తప్పించబోయి.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. - innova collided street pole that was going to escape a dog
కుక్కను తప్పించే క్రమంలో ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సోమవారం ఉదయం విజయనగరం - పాలకొండ రహదారి గాంధీ బొమ్మ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది.
కుక్కను తప్పించబోయి విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న ఇన్నోవా