విజయనగరం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ గ్రామ సమీపంలో ఏనుగు దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్న సమాచారంతో.. స్థానికులు చూసేందుకు వెళ్లారు.
వెనక మాటుగా వచ్చిన ఏనుగును ఎర్ర అక్కు అనే వ్యక్తి గమనించలేదు. అతడిని ఏనుగు తొండంతో గాయపరిచింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు, అటవీశాఖ సిబ్బంది పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.