ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

By

Published : Aug 15, 2020, 3:09 PM IST

విజయనగరం జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భద్రతా దళాలు, పురప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు గ్రామగ్రామాన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

Independence Day celebrations in Vijayanagaram district
విజయనగరం జిల్లాలో వాడవాడలా స్వాతంత్ర్య వేడుకలు

విజయనగరం జిల్లాలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారితో కలసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

కొవిడ్-19 ఆంక్షలు పాటిస్తూ భద్రత దళాలు కవాతు నిర్వహించాయి. అనంతరం మంత్రి, కొవిడ్ వారియర్స్ ను సత్కరించారు. కరోనా కాలంలో సేవల్లో ముందు వరుసలో నిలుస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి, పతకాలు అందజేశారు. విజయనగరం జిల్లా ప్రగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details