ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొటియా గ్రామాల్లో స్వాతంత్య్ర దినోత్సవాలు

By

Published : Aug 15, 2021, 4:26 PM IST

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలైన.. కొటియా వివాదాస్పద గ్రామాల్లో ఒడిశా అధికారులు.. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. స్థానిక గిరిజనులతో అధికారులు మాట్లాడారు. వివాదాస్పద గ్రామాల్లో కొటియా పంచాయతీకి స్వాగతం అని ఒడియా భాషలో రాసి బోర్డులను పెట్టారు.

Independence Day celebrations
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజయనగరం జిల్లా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలైన.. కొటియా పరిధిలోని వివాదాస్పద ప్రాంతాల్లో ఒడిశా అధికారులు... 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. ఐఏఎస్ ప్రోవేసన్ వేద బూసన్, మాజీ ఎమ్మెల్యే ప్రోపల్ పాంగి ఏరియా.. అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేశారు.

స్థానిక గిరిజనులతో అధికారులు మాట్లాడారు. అనంతరం కొటియా పోలీస్ స్టేషన్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో కొటియా పంచాయతీకి స్వాగతం అని ఒడియా భాషలో రాసి బోర్డులను పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details