విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్ పోస్ట్ గుండా అక్రమ తరలింపులు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఒడిశా దగ్గర బొరి గుమ్మి గ్రామం నుంచి బొలెరొ వాహనంలో తరలిస్తున్న 1.25 లక్షల రూపాయల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు..వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పాచిపెంట ఎస్సై గంగరాజు తెలిపారు
అక్రమంగా తరలిస్తున్న ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత - Illegally transporting khaini and gutka packets were seized
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 1.25 లక్షల రూపాయల విలువ చేసే ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న కైని, గుట్కా ప్యాకెట్లు పట్టివేత