గృహ నిర్మాణాలకు ఇసుక లభ్యం కాకపోవటం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుంది. ప్రభుత్వం చేపడుతున్న ఇసుకపై ప్రయోగాలు విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎస్ఈబి దాడుల్లో.. 570 టన్నుల అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో.. మండలంలోని మర్యాడ పంచాయతీలో 240 టన్నులు, పూసపాటిరేగ మండలం కంది మల్ల పంచాయతీలో 330 టన్నుల ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ డీ.డీ నాయుడు తెలిపారు.
570 టన్నుల ఇసుక అక్రమ నిల్వలు స్వాధీనం - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు తాజావార్తలు
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు జరిపిన దాడుల్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక నిల్వలను గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 570 టన్నుల ఇసుకను ఎస్ఈబీ అధికారులు స్వాధినం చేసుకున్నారు.
అక్రమ ఇసుక నిల్వలు స్వాధీనం చేసుకున్న ఎస్ఈబీ అధికారులు