విజయనగరం జిల్లా సాలూరు మండలం దుద్దు సాగరం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వి, తరలిస్తున్నారు. సాలూరు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్న గుత్తేదారుకు సంబంధించిన వ్యక్తులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. గతంలో రంగురాళ్ల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో తవ్వకాలు నిషేధించారు. నిబంధనలు అతిక్రమించి, ప్రభుత్వ భూమిలోని మట్టిని తరలిస్తున్నా.. అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు - అక్రమంగా మట్టి తవ్వకాల వార్తలు
విజయనగరం జిల్లా సాలూరు మండలం దుద్దు సాగరం గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. రెండేళ్ల కిందట ఈ ప్రాంతంలో తవ్వకాలు నిషేధించినా.. ఆ నిబంధన పట్టించుకోకుండా మట్టి తరలిస్తున్నారు.
అక్రమంగా మట్టి తవ్వకాలు