ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వంట కార్మికులకు ప్రభుత్వం రూ. 10 వేలు ఇవ్వాలి' - విజయనగరంలో వంట మాస్టర్ల ధర్నా వార్తలు

వంట మాస్టర్లు, హెల్పర్లను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం కలెక్టరేట్ వద్ద ఐద్వా నాయకులు ధర్నా చేపట్టారు. లాక్ డౌన్ కారణంగా వారు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

idwa dharnaa in vizianagaram for support cooking labours
విజయనగరంలో వంట మాస్టర్ల ధర్నా

By

Published : May 26, 2020, 3:46 PM IST

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వంట మాస్టర్లు, హెల్పర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులతో కలిసి విజయనగరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. లాక్ డౌన్ వలస వివాహాలు లేక, హోటళ్లు నడవక తమకు పనుల్లేకుండా పోయాయని వంట కార్మికుల అన్నారు.

ఉపాధి లేక కుటుంబం గడవక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమకు రూ. 10వేలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పీ. రమణమ్మ మాట్లాడుతూ.. వారిని కార్మికులుగా గుర్తించి, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్​కు వినతి పత్రం సమర్పించారు.

ఇవీ చదవండి... 'ఆలయాల అభివృద్ధి పేరుతో ఆస్తులు అమ్మేస్తారా?'

ABOUT THE AUTHOR

...view details