ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: భార్యను హత్యచేసిన భర్త - భార్యను చంపిన భర్త తాజా వార్తలు

విజయనగరం జిల్లా రామబద్రపురం మండల కేంద్రంలోని కనిమెరక వీధిలో దారుణం జరిగింది. కనిమెరక వీధిలో నివసిస్తున్న భార్యభర్తలు.. మజ్జి రమేష్, వెంకటలక్ష్మి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో.. ఆదివారం రాత్రి వారిద్ధరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. కోపాద్రిక్తుడైన రమేష్.. భార్యను కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

husband murdered wife at kanimeraka street in vizianagaram
దారుణం: భార్యను హత్యచేసిన భర్త

By

Published : Mar 29, 2021, 2:09 PM IST



విజయనగరం జిల్లా రామబద్రపురం మండల కేంద్రంలోని కనిమెరక వీధిలో దారుణం జరిగింది. జిల్లాకు చెందిన వెంకటలక్ష్మికి.. మజ్జి రమేష్ అనే వ్యక్తితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రమేష్ ఆటో డ్రైవర్​గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొంతగాలంగా.. భార్యా భర్తలు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరగటంతో.. కోపాద్రిక్తుడైన భర్త, భార్యను హతమార్చాడు. అనంతరం తనాకుతానే ఉరివేసుకున్నట్టు చిత్రీకరించాడు. అనుమానం వచ్చిన వెంకటలక్ష్మి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు విచారణ చేయగా.. తానే హత్య చేసినట్లు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details