విజయనగరం జిల్లా సీతానగరం మండలం మరిపివలస వద్ద విషాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృతి చెందారు.
ఆసుపత్రికి వచ్చి వెళుతూ.. తిరిగిరాని లోకాలకు! - మరిపివలస రోడ్డు ప్రమాదం
వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చి.. తిరిగి స్వగ్రామం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా మరిపివలస వద్ద చోటు చేసుకుంది.
accident
బాడంగి మండలం భీమవరానికి చెందిన కృష్ణ బొబ్బిలి ఐటీఐ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన భార్యను పార్వతీపురంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. తిరిగి వస్తుండగా కారు రూపంలో మృత్యువు కబళించింది. మృతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఇక దిక్కెవరు అంటూ కుటుంబీకులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సీతానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఈదురుగాలుల బీభత్సం... పలు ఇళ్లు నేలమట్టం