ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయితీ ఉల్లి కోసం జనం పరుగులు - vijayawada market latest news

రాష్ట్రంలో ప్రజలు రాయితీ ఉల్లి కోసం బారులు తీరారు. విజయవాడ, విశాఖపట్నంలోని మార్కెట్​లో రాయితీ ఉల్లి కోసం గంటల తరబడి క్యూలో వేచి చూస్తున్నారు.

huge people comes to buy onions at vijayanagaram market
విజయనగరం పార్వతీపురం మార్కెట్​లో ఉల్లికోసం జనం బారులు

By

Published : Dec 1, 2019, 3:32 PM IST

విజయనగరం పార్వతీపురం మార్కెట్​లో ఉల్లికోసం జనం బారులు

బయట మార్కెట్లో ఉల్లి ధర దిగి రావడం లేదు... గత కొన్ని రోజులుగా ఉల్లి ధర ఆకాశంలో విహరిస్తూ ఉండడం వల్ల రాయితీ ఉల్లికి డిమాండ్​ పెరిగింది. విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజారులో పోలీసుల బందోబస్తు నడుమ ఉల్లి పంపిణీ చేస్తున్నారు. బయట మార్కెట్లో కిలో రూ.80 పలకటంతో అన్ని వర్గాల వారు రాయితీ ఉల్లి కోసం పరుగులు పెడుతున్నారు. కిలో ఉల్లి రూ.25 రూపాయలకు ఉల్లి తీసుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.

విజయవాడలో

విజయవాడలోని భవానిపురం రైతు బజార్​లో సైతం వినియోగదారులు ఉల్లిపాయల కోసం క్యూలైన్లు కట్టారు. ఒక్కటే కౌంటర్ పెట్టినందున వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.

ఇదీ చదవండి:

మధ్యాహ్నం భోజన బియ్యంలో పురుగులు... ఆందోళనలో తల్లిదండ్రుల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details