విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ వాహనం చూపరులకు కనువిందు చేసింది. 102 చక్రాలు ఉన్న ఈ భారీ వాహనాన్ని.. స్థానికులు వింతగా చూశారు. సాంకేతిక పరికరలాను నాగాలాండ్ వైపు తీసుకువెళ్తున్న వాహనం.. విజయవాడ నుంచి బయల్దేరినట్టు డ్రైవర్ చెప్పారు.
102 చక్రాలతో కనువిందు చేసిన భారీ వాహనం - విజయనగరంలో అతిపెద్ద లారీ వార్తలు
అమ్మో! ఎంత పెద్ద లారీయో! ఇంత పెద్ద లారీని ఎప్పుడూ చూడలేదు.. అంటూ విచిత్రంగా ఆ వాహనం చూపరులను ఆకట్టుకుంది. విజయవాడ నుంచి నాగాలాండ్ వైపు వెళ్తున్న ఈ వాహనం విజయనగరం జిల్లా భోగాపురం జాతీయ రహదారిపై కనిపించింది. సాంకేతిక పరమైన పరికరాలు తీసుకెళ్తున్న ఈ వాహనానికి 102 చక్రాలు ఉన్నాయి. పరిమితమైన వేగంతో ఈ వాహనం వెళ్లగా.. అంతా ఆసక్తిగా చూశారు.
102చక్రాలతో కనువిందు చేసిన భారీ వాహనం