ఇసుక సమస్యపై విజయనగరం భవన నిర్మాణ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్లు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉందుబాటులోకి తీసుకొచ్చిన ఇసుక ధరలకు సామాన్యులు కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడిందని సీఐటీయూ నాయకుడు రమణ తెలిపారు. భవన నిర్మాణాలు జరగక భవన నిర్మాణ కార్మికుల బతుకులు వీధిన పడ్డాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, పరిస్థితిని బాగుచేయాలని డిమాండ్ చేశారు. ఇదే ధోరణి కొనసాగితే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇసుక కోసం ఖాళీ ప్లేట్లతో ధర్నా - నూతన ఇసుక విధానం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంతో ఇబ్బందులు పడుతున్న విజయనగరం భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.
విజయనగరం కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల ధర్నా