కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులకూ చేదోడు వాదోడుగా నిలవాలనుకున్నారు.. విజయనగరం పట్టణానికి చెందిన హోప్ గివింగ్ సంస్థ సభ్యులు. విజయనగరంలోని మురికివాడలు, శివారు కాలనీల్లోని వీధులను శుభ్రం చేసేందుకు శ్రీకారం చుట్టారు. వీధులను శుభ్రం చేయటంతో పాటు చెత్తాచెదారం తొలగించటం, మురుగు కాల్వల వద్ద బీచ్లింగ్ పౌడర్ చల్లటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కార్మికులకు కొంతమేర పనిభారం తగ్గించే క్రమంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హోప్ గివింగ్ సంస్థ సభ్యులు చెబుతున్నారు.
చెత్త ఊడుస్తూ.. బ్లీచింగ్ చల్లుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు చేయూత - hope giving charity help sanitizing labour
కరుణ లేని కరోనా అన్ని వ్యవస్థలు, రంగాలను స్తంభింపచేసింది. చిన్నచిన్న పనులు చేసుకునే వారిని రోడ్డున పడేసింది. నిరాశ్రయులు, అనాథలు, యాచకులకు కడుపు నిండా భోజనం లేకుండా చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు పలువురు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలు, మాస్కులు అందిస్తూ తోచిన సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. విజయనగరానికి చెందిన హోప్ గివింగ్ స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకేసి., పారిశుద్ధ్య కార్యక్రమంలో పాలుపంచుకుంటోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న సమయంలోనూ పారిశుద్ధ్య కార్మికుల నిరంతర శ్రమకు హోప్ గివింగ్ సంస్థ సభ్యులు తోడుగా నిలుస్తున్నారు.
![చెత్త ఊడుస్తూ.. బ్లీచింగ్ చల్లుతూ.. పారిశుద్ధ్య కార్మికులకు చేయూత hope giving charity help sanitizing labour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6772194-1096-6772194-1586787120104.jpg)
హోప్ గివింగ్ సంస్థ సాయం
TAGGED:
హోప్ గివింగ్ సంస్థ సాయం