ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో పోలీస్​శాఖ మెరుగైన సేవలు అందిస్తోంది'

ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత విజయనగరం చేరుకున్నారు. పలువురు మంత్రులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మెరుగైన సేవలందిస్తోందని కొనియాడారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ఏమిటని ప్రశ్నించారు.

Home minister mekathoti sucharitha tour in vizianagaram district
రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత

By

Published : Oct 29, 2020, 7:38 PM IST

రాష్ట్రంలో ప్రమాదాలు జరగకుండా మరింత సాంకేతికత వినియోగించేందుకు కృషి చేస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా..... శ్రీకాకుళం అగ్నిమాపక కేంద్రం మొదటి అంతస్తు భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువులు మంత్రులు, సభాపతి పాల్గొన్నారు. అగ్నిమాపక, పోలీసు సేవలను హోం మంత్రి కొనియాడారు.

మెరుగైన సేవలు...

రాష్ట్రంలో పోలీసుశాఖ మెరుగైన సేవలు అందిస్తోందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసుశాఖను పలు జాతీయ అవార్డులు వరించటమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మూడు రోజుల ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా... విజయనగరం జిల్లాకు వచ్చారు. విజయనగరంలోని జిల్లా పరిషత్తు అతిధి గృహానికి చేరుకున్న హోం మంత్రికి... ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ‌వాణి, శాస‌న‌స‌భ్యులు, ఎస్పీ, సంయుక్త క‌లెక్టర్, అధికారులు స్వాగ‌తం ప‌లికారు.

అవార్డులు మనకే అధికం...

రాష్ట్ర పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవ‌లు అందిస్తోంద‌ని, మొబైల్ ఫోన్ ద్వారా ఈ సేవ‌లను వినియోగించుకోవ‌చ్చని మంత్రి మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు. చరవాణిలోని యాప్ ద్వారా సులువుగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చని సూచించారు. స్కోచ్ సంస్థ 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రక‌టిస్తే... అందులో 48 అవార్డులు మ‌న రాష్ట్ర పోలీసు శాఖ‌కే లభించడం గర్వకారణమన్నారు.

ఎస్ఈసీ సమావేశంపై స్పందన...

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈసీ సమావేశం నిర్వహించటం పట్ల మంత్రి స్పందిస్తూ... ఇప్పుడు సమావేశం పెట్టిన ఎలక్షన్ కమిషన్.. ఎన్నికలు రద్దు చేసినప్పుడు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 26 కేసులు ఉన్నప్పుడు ఎన్నికలను వాయిదా వేసి, 8 లక్షల కేసులు దాటినప్పుడు చేప‌డ‌తామ‌ని చెప్పటం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

గిరిజన భాషలకు లిపితో జీవం పోసిన.. ప్రసన్నశ్రీ

ABOUT THE AUTHOR

...view details