ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రివాల్వర్‌తో కాల్చుకుని.. హోమ్ గార్డ్స్ విభాగం అధికారి ఆత్మహత్య - vizianagaram crime

రివాల్వర్‌తో కాల్చుకుని.. హోమ్ గార్డ్స్ విభాగం ఆర్‌.ఐ. ఆత్మహత్య
రివాల్వర్‌తో కాల్చుకుని.. హోమ్ గార్డ్స్ విభాగం ఆర్‌.ఐ. ఆత్మహత్య

By

Published : Jan 2, 2022, 2:45 PM IST

Updated : Jan 2, 2022, 6:31 PM IST

14:42 January 02

విజయనగరం జిల్లాలో ఘటన

విజయనగరం జిల్లా హోమ్ గార్డ్స్ ఆర్.ఐ గా పనిచేస్తున్న ఈశ్వరరావు.. విజయనగరం పోలీస్ క్వార్టర్స్ నివాసంలో తన రివాల్వర్ తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2009లో ఆర్​ఎస్​ఐగా కాకినాడలో జాయిన్ అయ్యారు. 2019లో కాకినాడ నుంచి విజయనగరంలో ఆర్​ఐగా పోస్టింగ్ అయ్యారు. ఉన్నట్టుండి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు.. ఈశ్వర్‌రావు మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని ఎస్పీ దీపిక పాటిల్ సందర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అధికారులు వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డారా..? లేక మరేదైనా సమస్యలతో ఈ దారుణానికి పాల్పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి :
CPI Ramakrishna on YCP schemes : మీ ప్రభుత్వం చేసిన అభివృద్ది ఏంటో చెప్పగలరా: సీపీఐ రామకృష్ణ

Last Updated : Jan 2, 2022, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details