ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో సమావేశ మందిరం ప్రారంభం - district collectore latest news update

విజయనగరం గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో నూతనంగా రూపొందించిన సమావేశం మందిరాన్ని జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్​ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను గృహ నిర్మాణ సంస్థ అధికారులు శాలువా కప్పి మెమెంటో అందజేశారు.

Home building company
కలెక్టర్​ చేతుల మీదుగా గృహనిర్మాణ సంస్థ కార్యాలయం ప్రారంభం

By

Published : May 22, 2020, 10:27 AM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, వాటితో పాటు ప్రతి పేదవారికి ఇల్లు ఉండాలనే భావనతో రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని తెలిపారని కలెక్టర్​ పేర్కొన్నారు.గృహనిర్మాణ సంస్థ కార్యాలయంలో నూతనంగా రూపొందించిన సమావేశం మందిరాన్ని ప్రారంభించిన ఆయన జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ కీలకమని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details