ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ బాధిత కుటుంబాలకు అండగా.. హిందూ ధర్మసేన - Hindu Dharma Sena members in vizianagaram news update

ఒకే గ్రామంలో 37 మందికి కరోనా సోకటం.. విజయనగరం జిల్లా తొనం పంచాయతీలో కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయా కుటుంబ సభ్యులు నిత్యావసర సరకుల కొనుగోళ్లుకు సైతం బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. విషయం తెలుసుకున్న హిందూ ధర్మ సేన సభ్యులు... గ్రామస్థులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

Hindu Dharma Sena members distributed essential goods
హిందూ ధర్మ సేన సభ్యులు నిత్యావసరాలు పంపిణీ

By

Published : May 19, 2021, 12:20 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం తొనం పంచాయతీలోని ఓ గ్రామంలో 37 మందికి కరోనా సోకింది. వారందరినీ బొబ్బిలి కరోనా కేర్ సెంటర్​కు తరలించారు. మిగతా కుటుంబ సభ్యులు నిత్యావసర సరకుల కొనుగోళ్లుకు సైతం బయటకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు.

విషయం తెలుసుకున్న సాలూరులోని హిందూ ధర్మ సేన సభ్యులు.. ఆయా కొవిడ్ బాధిత కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గ్రామంలో ఉన్న మొత్తం 34 కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి, పోలీసులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details