HC On Bhogapuram Airport: విజయనగరం జిల్లా భోగాపురం వద్ద ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణ ప్రకటనను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు, అప్పీలును హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. వ్యాజ్యాల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయపరమైన విషయాలు కనిపించటంలేదని, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వ్యాజ్యాలను కొట్టివేస్తున్నామని.. తీర్పులో పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్‌ను గతనెల్లో సుప్రీం కోర్టు కొట్టివేయగా, తాజాగా హైకోర్టు కూడా కేసులను కొట్టివేయటంతో,. ఈనెలలోనే ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
భోగపురం విమానాశ్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
విజయనగం భోగాపురం ఎయిర్ పోర్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. భసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేయడంతో.. విమానాశ్రయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్లేనని భావిస్తున్నారు.
Etv Bharat