ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరంలో సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​ ప్రారంభోత్సవం.. సందడి చేసిన హీరోయిన్లు - రాశీఖన్నా

SOUTH INDIA SHOPPING MALL IN VIZIANAGARAM :సినీ తారలు రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌.. విజయనగరంలో మెరిశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సౌత్‌ ఇండియా షాపింగ్ మాల్‌ను.. ప్రారంభించారు. అనంతరం దుకాణంలో తిరిగి వివిధ విభాగాలను పరిశీలించారు. ఆభరణాలను అలంకరించుకుని మురిసిపోయారు.

SOUTH INDIA SHOPPING MALL IN VIZIANAGARAM
SOUTH INDIA SHOPPING MALL IN VIZIANAGARAM

By

Published : Dec 2, 2022, 5:42 PM IST

SOUTH INDIA SHOPPING MALL : సంప్రదాయాల్ని, అధునాతన వస్త్రశైలిని ఇష్టపడే ఉత్తరాంధ్ర ప్రజల అభిరుచి దృష్ట్యా., సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూం ను విజయనగరంలో ప్రారంభించింది. ఈ షాపింగ్​ మాల్​ని ప్రముఖ సినీతారలు రాశీఖన్నా, పాయల్ రాజ్​పుత్ ప్రారంభించారు. అనంతరం ఆభరణాలు ధరించి షోరూంలో సందడి చేశారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు సురేష్ సీర్న, అభినయ్, రాకేష్, రాజేష్​తో పాటు., షాపింగ్ మాల్ మొత్తం తిరిగి వస్త్రశ్రేణి, ఆభరణాలు, కలెక్షన్స్​ను పరిశీలించారు.

ఒక కుటుంబంలోని అన్ని తరాల వారి అభిరుచులు, అవసరాలకు తగ్గట్టు విస్తృత, వైవిధ్యమైన వస్త్రాలు, ఆభరణాలను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయనగరంలో అందుబాటులోకి తీసుకొచ్చిందని హీరోయిన్లు తెలిపారు. తమ షాపింగ్ మాల్​లో 4లక్షల పైచిలుకు వైరైటీలు ఉన్నాయని.. మెన్స్, ఉమెన్స్, కిడ్స్​వేర్​తో పాటు.. 916హాల్ మార్క్​ ఆభరణాలు ఉన్నాయని షాపింగ్​మాల్​ ప్రతినిధులు తెలిపారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీతారలను చూసేందుకు విజయనగరం ప్రజలు పెద్దఎత్తున తరలిరావటంతో.. షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంగా మారాయి.

విజయనగరంలో సౌత్​ ఇండియా షాపింగ్​ మాల్​ ప్రారంభోత్సవం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details