ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిచ్చగాళ్లకు బాసటగా హెల్పింగ్ హాండ్స్ - చీపురుపల్లి యాచకులకు హెల్పింగ్ హాండ్స్ బాసట

రోడ్ల పక్కనున్న బిచ్చగాళ్లను అనేక మంది చిన్నచూపు చూస్తుంటారు. కొందరు దయతలచి తోచిన సాయం చేస్తారు. వారూ మనలాంటి మనుషులేనని గుర్తించి మరికొందరు అక్కున చేర్చుకోవడం చూస్తూనే ఉన్నాం. రాజమహేంద్రవరానికి చెందిన 'హెల్పింగ్ హాండ్స్' ఈ కోవకు చెందినదే. రాష్ట్రాలతో సంబంధం లేకుండా సమాజ సేవలో ఆ సంస్థ ముందుకు సాగుతోంది.

helping hands
హెల్పింగ్ హాండ్స్ బాసట

By

Published : Oct 3, 2020, 4:43 PM IST

హెల్పింగ్ హాండ్స్ బాసట

మాసిన గడ్డంతో, నెరిసిన జుట్టుతో రోడ్ల పక్కన అనేక మంది యాచకులు పలు ప్రాంతాల్లో నిత్యం దర్శనమిస్తూనే ఉంటారు. వారికి ఎంతో కొంత సాయం చేసే వాళ్లు కొందరుండగా.. పట్టించుకోని వారెందరో. 'మానవసేవే మాధవ సేవ' అంటూ మానవత్వాన్ని చాటుతోంది.. 'హెల్పింగ్ హాండ్స్' సంస్థ.

సేవా తత్పరత

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో రోడ్ల వెంటనున్న బిచ్చగాళ్లకు కటింగ్, షేవింగ్ చేయించారు.. 'హెల్పింగ్ హాండ్స్' ప్రతినిధులు. వారికి మంచి వస్త్రాలు అందించి, భోజనం పెట్టారు. దుమ్ము, ధూళితో సహవాసం చేసే అభాగ్యులకు శుభ్రత నేర్పించారు.

ఆంధ్ర టూ కర్ణాటక

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తాము సేవలు అందిస్తున్నామని 'హెల్పింగ్ హాండ్స్' సభ్యులు పేర్కొన్నారు. ఆంధ్ర మాత్రమే కాక.. కర్ణాటకలోని బెంగుళూరు వరకు సేవా తత్పరతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తమ ఆశయాల్లో భాగంగానే చీపురుపల్లిలో ఈ పనికి పూనుకొన్నామన్నారు.

సమాచారం అందిచండి

ఈ తరహా దయనీయ స్థితిలో ఎవరైనా బిచ్చగాళ్లు ఉన్నారని తెలిస్తే.. తమకు సమాచారం అందించాలని సంస్థ ప్రతినిధులు కోరారు. సాధ్యమైనంత వరకు తమ కార్యక్రమాలను విస్తరిస్తూ పోవడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

చివరి దశకు ప్రాంతీయ క్రీడా పాఠశాల నిర్మాణ పనులు

ABOUT THE AUTHOR

...view details