విజయనగరం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి...ఉదయం 9 గంటల కాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. వేడితో పాటు వడగాలులు వీయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 లోపే ఎండలు సుర్రుమంటున్నాయి. పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. పగటితో పాటు రాత్రివేళ కూడా ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడికి వడగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
మండుతున్న ఎండలు..భయపడుతున్న ప్రజలు - temperature updates at vizianagaram
రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలుంటున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటైనే భయపడుతున్నారు.
![మండుతున్న ఎండలు..భయపడుతున్న ప్రజలు heavy temperature at vizianagaram dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7304043-38-7304043-1590170689276.jpg)
దంచేస్తోన్న ఎండలు...
రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. డీహైడ్రేట్ కు గురికాకుండా ద్రావణం, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలన్నారు. అత్యవసరమైతే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.