వర్షాలతో దెబ్బతిన్న రోడ్లతో వాహనదారుల అవస్థలు
విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు గోతులమయంగా మారాయి. వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పార్వతీపురం పురపాలక సంఘం పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు గోతులమయంగా తయారయ్యాయి. పాలకొండ రహదారి పైవంతెన సమీపంలో రోడ్డు ధ్వంసమైంది. బెలగాం శివారులోని ఎస్.ఎన్.ఎన్ కాలనీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఇప్పటికీ రహదారిపై నీరు పారుతుండడం వల్ల కోతకు గురవుతోంది. ఆ దారి నుంచి ప్రయాణిస్తున్నవారు నానా అగచాట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.