పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరహాల గెడ్డ ప్రవాహం పెరిగింది. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న గణేష్ నగర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారి పూర్తిగా ముంపునకు గురైంది. కాలనీలో సరైన కాలువలు లేక వరద నీరు నివాసాల మధ్య ఉండిపోయింది. దీంతో అక్కడి రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది.
పార్వతీపురంలో వర్షాలు... రహదారులు జలమయం - పార్వతీపురం తాజా వార్తలు
అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలకు పార్వతీపురంలోని పలు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
![పార్వతీపురంలో వర్షాలు... రహదారులు జలమయం heavy rains in parvathipuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9047336-885-9047336-1601818240804.jpg)
పార్వతీపురంలో జలమయమైన కాలనీలు, రోడ్లు