విజయనగరంలో భారీ వర్షం
ఎండ, వడగాల్పులతో అల్లాడిపోతున్న విజయనగరం ప్రజలు భారీ వర్షం కురవటంతో ఉపశమనం పొందారు. వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి.
విజయనగరంలో భారీ వర్షం
విజయనగరంలో భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. దత్తిరాజేరు మండలం బుర్జవలస గ్రామంలో ఓ ఇంటిపై పిడుగు పడింది. ఆ ఇంటిలో సామాగ్రంత పాడైపోయాయి. అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఎవరు లేకపోవటంతో ప్రమాదం తప్పింది. అయితే జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురవటంతో జిల్లా ప్రజలు వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందారు.