విజయనగరం పట్టణంలో కొన్ని రోజులుగా విపరీతమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే అధికంగా ఎండలు ఉండటంతో.. స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఉక్కపోతకు ఉపశమనాన్నిస్తూ.. జిల్లా కేంద్రంలో ఇవాళ మూడు గంటల పాటు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.
జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, తోటపాలెం, అరుణా జ్యూట్ మిల్ సహా పలు ప్రదేశాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి.