Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులు వైద్య సేవల కోసం అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఆస్పత్రులకు వెళ్లేందుకు సరైన రోడ్లు లేకపోవడంతో డోలీలే శరణ్యమవుతున్నాయి. ఎన్నో కష్టాలకోర్చి ఆసుపత్రులకు చేరుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు దక్కినా.. చాలాసార్లు విషాదమే చోటు చేసుకుంటోంది. నిత్యం గిరిజనులకు ఈ తిప్పలు తప్పడం లేదు. తాజాగా కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో ప్రసూతి ఆసుపత్రికి రోడ్డు సౌకర్యం లేక ఓ నిండు గర్బిణి మార్గ మధ్యలోనే ప్రసవించింది. బంధువులు సరోజిని ఊటకోసు గ్రామం నుంచి వాగులు, వంకలను అతి కష్టంతో డోలి మోతతో కొమరాడ నుంచి వనాక బడి వరకు మోసుకొచ్చారు. అనంతరం 108 వాహనంలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
రోడ్డు మార్గం లేక గర్భిణీ అవస్థ.. మార్గ మధ్యలోనే ప్రసవం - AP UPDATE NEWS
Parvathipuram Manyam: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ఇంకా మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం లేదు.. దీంతో సరైన వైద్యం అందక అనేకమంది మృత్యువాతపడుతున్నారు. రోగాల బారిన పడినప్పుడు గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
పార్వతీపురం మన్యం