ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలీస్ జాగిలాల పనితీరు, ఆరోగ్యం పర్యవేక్షించిన అధికారులు

By

Published : Dec 2, 2020, 7:25 PM IST

విజయనగరం జిల్లా పోలీస్ శాఖలోని జాగిలాల పనితీరు, ఆరోగ్యాన్ని ఐఎస్​డబ్ల్యూ అధికారులు పర్యవేక్షించారు. జాగిలాల ఆరోగ్యంపై డాగ్ హ్యాండలర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్ విభాగం రికార్డులను పరిశీలించారు.

health checkup for police dongs at Vizianagaram
పోలీస్ జాగిలాల పనితీరు, ఆరోగ్యం పర్యవేక్షించిన అధికారులు

విజయనగరం జిల్లా పోలీస్ శాఖలోని జాగిలాల పనితీరు, ఆరోగ్యాన్ని పోలీస్ పరేడ్ గ్రౌండ్​లో ఐఎస్​డబ్ల్యూ అధికారులు పర్యవేక్షించారు. ఇంటిలిజెన్సు సెక్యూరిటీ విభాగం చీఫ్ టీవీ. శవిధర్​రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ చెందిన అధికారుల బృందం వార్షిక తనిఖీల్లో భాగంగా జాగిలాలను పరిశీలించారు. వాటి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, సంతృప్తి వ్యక్తం చేశారు. వాటి ఆరోగ్యం పట్ల డాగ్ హ్యాండలర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్ విభాగం రికార్డులను పరిశీలించారు.

నేర స్థలం నుంచి పరారైన నిందితులను పట్టుకోవడం, ఎక్స్​ప్లోజివ్ మెటిరియల్​ను గుర్తించడంలో జాగిలాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇటువంటి జాగిలాల పనితీరు, ఆరోగ్యాన్ని వెటర్నటీ డాక్టరు, ఐఎస్​డబ్ల్యూ అధికారులు ప్రతీ ఏడాది పరిశీలిస్తుంటారు.

ఇదీ చూడండి:

కోలుకున్నాక నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటాం: డీసీపీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details