విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై మద్యం తరలిస్తూ హెడ్ కానిస్టేబుల్ పట్టుబడ్డాడు. ఎస్ఐ నీలకంఠం అందించిన వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అరకు వైపు నుంచి వస్తున్న ద్విచక్రవాహనం ఆపి తనిఖీ చేశారు. వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యలో గోనెసంచిలో మద్యం సీసాలను గుర్తించామన్నారు. ఆ సంచిలో 90 మద్యం సీసాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో ఒకరు శ్రీనివాసరావు ఐదవ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ప్రస్తుతం హుకుంపేట క్యాంపులో విధులు నిర్వహిస్తున్నారు. రెండో వ్యక్తి కొత్తకోట శ్రీను బెటాలియన్లో దోబిగా పని చేస్తున్నాడు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మద్యం సీసాలను, ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్నహెడ్ కానిస్టేబుల్ - విజయనగరంలో అక్రమంగా మద్యం తరలిస్తున్నహెడ్ కానిస్టేబుల్
హెడ్ కానిస్టేబుల్ అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. ద్విచక్రవాహనంపై 90 మద్యం సీసాలను గోనెసంచిలో తీసుకెళ్తుండగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
head constable
TAGGED:
అక్రమంగా మద్యం రవాణా