విజయనగరం జిల్లా తెలగా సంఘం అధ్యక్షుడు పల్లంట్ల వెంకటరావు.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు అన్నదానం చేస్తున్నారు. 35 రోజులుగా అతనితో పాటు కుటుంబ సభ్యులంతా కలసి.. దాదాపు 250 మంది నిరుపేదలకు, అనాథలకు, యాచకులకు ఆహారం అందిస్తున్నారు.
నిత్యం 250 మంది పేదలకు అన్నదానం - latest news corona
లాక్ డౌన్ కారణంగా పేదలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వస్తూ వారిని ఆదుకుంటున్నారు. విజయనగరంలోనూ ఇలా ఓ దాత పేదలను ఆదుకున్నాడు.
భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్న పల్లంట్ల వెంకటరావు