ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు విశ్రాంతి గది, జిమ్​ను ప్రారంభించిన ఎస్పీ - vijayanagaram police news

పోలీసు అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన గౌతమబుద్ధ బ్యారక్​ను ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామశాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

rest room started
rest room started

By

Published : Jun 15, 2021, 7:49 PM IST

ఏఆర్​ పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు, వ్యాయామం చేసుకునేందుకు గౌతమబద్ధ బ్యారక్​తో పాటు, ఓ వ్యాయామశాలను జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ వాటిని నిర్మించామని చెప్పారు. బయట ప్రాంతాల నుంచి విధులు నిర్వహించేందుకు వచ్చే మహిళా హోం గార్డులు జిల్లా కేంద్రంలో వసతి లేక ఇబ్బందులు పడేవారని .. వారి కోసం అన్ని సౌకర్యాలతో విశ్రాంతి గదిని ఏర్పాటు చేశామన్నారు. బ్యారక్​ను నిర్మించడంలో శ్రమదానం చేసిన పోలీసులను ఎస్పీ.. నూతన వస్త్రాలు బహుకరించి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details