విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున సాలూరు పట్టణానికి ఆనుకొని ఉన్న వేగావతి బ్రిడ్జ్ దగ్గర భారీగా తరలిస్తున్న 8 లక్షల 85 వేల 200 రూపాయలు విలువచేసే ఖైనీ గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. తెల్లవారు జామున వ్యాన్లో బయటకు మీల్మేకర్ వేసి..లోపల సరకు అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు. ఈ వాహనం ఒడిశా రాష్ట్రం నుంచి వైజాగ్ లోని భీమిలి తరలిస్తుండగా సాలూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని, సరకు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్నరూ. 8లక్షల విలువై గుట్కా స్వాధీనం - విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్నగుట్కా స్వాధీనం
ఒడిశా రాష్ట్రం నుంచి వైజాగ్ లోని భీమిలికి అక్రమంగా గుట్కాను తరలిస్తుండగా సాలూరు పట్టణ పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 8లక్షలకు పైగా ఉంటుదని పోలీసులు తెలిపారు.

Gutka seized